మయన్మార్‌లో భూకంప విలయంలో మరణించిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 1700 మంది మృతిచెందగా, 3,400 మంది గాయపడినట్లు జాతీయ మీడియా పేర్కొంది. సహాయక చర్యలు ముగిసేవరకు మృతుల సంఖ్య 10 వేలకు పైగా ఉండొచ్చని అంచనా. వంతెనలు కూలిపోవడం, రోడ్డు, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్న కారణంగా రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకాలు ఎదురవుతున్నాయి.