గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 23 మంది విద్యార్థులకు అస్వస్థత (వీడియో)

58చూసినవారు
TG: కరీంనగర్ జిల్లాలోని గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. జిల్లా కేంద్రం సమీపంలో శర్మానగర్‌లో మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో 23 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం అర్ధరాత్రి విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో గుర్తించిన పాఠశాల సిబ్బంది.. హుటాహుటిన విద్యార్థులను ప్రభుత్వాస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్