కేరళ, తమిళనాడులా రైతులకు రూ. 500 బోనస్, సబ్సిడీపై ఎరువులు, పురుగు మందులు, రైతు భరోసా ఇవ్వాలని సిపిఎం ఆచంట మండల కన్వీనర్ కాకర వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు పాల్గొన్నారు.