కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదకళ్ళేపల్లి గ్రామంలో స్వయంభుగా వేంచేసి ఉన్న శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి వారి దేవస్థానానికి మోపిదేవి నుండి ప్రతి ఆదివారం ఉచిత బస్ సర్వీసు నడుపుతున్నారు. చల్లపల్లికి చెందిన ప్రైవేట్ కాలేజి ఉచితంగా బస్సును అందించగా, గ్రామ సర్పంచ్ ఆ బస్సుకు డీజిల్ మరియు బస్సు డ్రైవర్ వేతనం సమకూరుస్తున్నారు. ప్రతి ఆదివారం ఉచితంగా బస్సు రెండు ట్రిప్పులు నడుపుతున్నారు.