ఇసుక రీచ్ ప్రాంతాన్ని పరిశీలించిన ఆర్డీవో

64చూసినవారు
ఇసుక రీచ్ ప్రాంతాన్ని పరిశీలించిన ఆర్డీవో
కృష్ణాజిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలోని ఇసుక నిల్వ చేసే రీచ్ ప్రాంతాన్ని మచిలీపట్నం ఆర్డిఓ ఎం. వాణి ఆదివారం పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదో తేదీ నుంచి ఉచిత ఇసుక పాలసీ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆమె శ్రీకాకుళం ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ విజయలక్ష్మితో మాట్లాడి ఇసుక నిల్వ చేసే విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్