భీమవరం మండలం రాయలంలో సోమవారం నూతన రక్త కేంద్రాన్ని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్, కలెక్టర్ నాగరాణి, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఏపీ స్టేట్ చైర్మన్ డా. శ్రీధర్‌రెడ్డి రక్త నిధి కేంద్రంలోని వివిధ విభాగాలను సంయుక్తంగా ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్‌క్రాస్ ద్వారా సమకూర్చిన నిధులతో అవసరమైన మిషనరీ, పరికరాలు తదితరాలను ఏర్పాటు చేశామన్నారు.