విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు మానవత్వంతో దాతలు ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విజయవాడ బాధితులకు సహాయార్థం జివిఐటి గ్రూప్ అఫ్ ఇన్స్టిట్యుషన్ రూ. లక్ష సహాయాన్ని సోమవారం ఎమ్మెల్యే అంజిబాబుకు అందించారు. దాతలందిస్తున్న సహకారం ఎంతో విలువైనదని దాతలను అభినందించారు.