ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం మానవత్వమని, తోటివారికి సహాయం చేయడంలో తెలియని సంతృప్తి ఉంటుందని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం భీమవరం బ్యాంక్ కాలనీకి చెందిన క్యాన్సర్ బాధితురాలు యడ్ల వేణుకు దాతలు కోడలి రమేష్, బాపిరాజు సహకారంతో రూ. 20 వేలు ఆర్ధిక సహాయాన్ని ఎమ్మెల్యే అంజిబాబు చేతులమీదుగా అందించారు. అనంతరం దాతలందిస్తున్న సహకారాలు అద్వితీయమన్నారు.