పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం మత్స్యపురిపాలెంలో బుధవారం రాత్రి గ్రామ దేవత శ్రీ పెన్నమ్మ అమ్మవారి జాతర మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద నిర్వహించిన గరగల నృత్యం భక్తులను ఆకట్టుకుంది. ప్రతి ఏడాది సంక్రాంతి, కనుమ పండుగ రోజున అమ్మవారికి గ్రామస్థులు నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.