విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ తమ సహాయ సహకారాలను ముమ్మరం చేసింది. బుధవారం 5000 వాటర్ పాకెట్స్, 3000 బిస్కెట్ పాకెట్స్, 500 బ్రెడ్ పాకెట్స్, 1000 ఫుడ్ పాకెట్స్, 500 బన్ ప్యాకెట్లను ఎన్జీవోస్ లీడర్ చోడగిరి శ్రీనివాస్ విజయవాడకు తరలించారు. బాధితులకు మరింత సాయం అందిస్తామని చెప్పారు.