JRG: బుసలు కొడుతున్న తెల్ల తాచుపాము

54చూసినవారు
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట గ్రామంలో శనివారం తెల్ల తాచుపాము జనావాసాల్లో హల్‌చల్ చేసింది. గ్రామానికి చెందిన కడిమి గోపి ఇంట్లోకి పాము ప్రవేశించడంతో ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్ సేవియర్ సొసైటీ అధ్యక్షుడు చదలవాడ క్రాంతికి సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అనంతరం చాకచక్యంగా పామును పట్టుకొని సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్