పెదవేగి మండలంలోని రాట్నాలకుంటలో కొలువైయున్న శ్రీ రాట్నాలమ్మ అమ్మవారి ఆలయానికి ఆదివారం కావడంతో భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.