పెదపాడు: కోళ్ళ వ్యర్థాలు తరలిస్తున్న వాహనాలు సీజ్

64చూసినవారు
పెదపాడు ఎస్ఐ సతీష్ శనివారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా చేపల చెరువులకు చికెన్ వ్యర్ధాలు తరలిస్తున్న ఆరు వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ. తోటగూడెం 2, వడ్డిగూడెం 2, వసంతవాడ 1, నాయుడుగూడెంలో 6 ట్రక్కుల ద్వారా చికెన్ వ్యర్ధాలు తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. అనంతరం సదురు యజమానులపై కేసులు నమోదు చేయడం జరిగిందని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్