బిజెపి పార్టీని బలపరుస్తున్న టిడిపి, వైసిపి పార్టీలను చిత్తు చిత్తుగా ఓడించి ఇండియా కూటమి ఎమ్మెల్యే, ఎంపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఇండియా కూటమి జగ్గయ్యపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కర్నాటి అప్పారావు, ఎంపీ అభ్యర్థి వల్లూరు భార్గవ్ పిలుపునిచ్చారు. జగ్గయ్యపేట పట్టణంలో సోమవారం ఇండియా కూటమి అభ్యర్థిలను గెలిపించాలని కోరుతూ సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీల సంయుక్త ఎన్నికల ప్రచారం నిర్వహించారు.