జగ్గయ్యపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా జై భీమ్ పార్టీ తరుపున నామినేషన్ దాఖలు చేసిన కరిసే మధు సోమవారం టిడిపిలోకి చేరారు. జగ్గయ్యపేట నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు శ్రీరాం చిన్నబాబు ఆధ్వర్యంలో జై భీమ్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా చిన్నబాబు వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు ప్రసాద్, యమర్తి బోస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.