జగ్గయ్యపేట మండలం జయంతిపురం గ్రామానికి చెందిన పసుపులేటి శ్రీను, రుక్మిణి, నాగమ్మ, దుర్గాలను ఇటీవల స్థానిక తెలుగుదేశం నాయకులు వివిధ ప్రలోభాలకు గురిచేసి ఆ పార్టీలోకి చేర్చుకున్నారు. వాస్తవాలు తెలుసుకొని ప్రభుత్వవిప్, శాసనసభ్యులు సామినేని ఉదయభాను సమక్షంలో తిరిగి సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.