కైకలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ మంగళవారం అసెంబ్లీలో పలు సమస్యలను ప్రస్తావించారు. డ్రైనేజీలు పూడిక పనులు గత ఐదేళ్లలో లేకపోవడం వల్ల ఇటీవల బుడమేరు కాలువ ఉధృతంగా ప్రవహించిన నేపథ్యంలో 20 రోజులపాటు రహదారులపై వరద నీరు నిలిచిపోయిందని అన్నారు. కావున రైతుల సమస్యలు పరిష్కరించడానికి బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఆయన సూచించడం జరిగింది.