కైకలూరు నియోజకవర్గం లోని నాలుగు మండలాల్లో శుక్రవారం శ్రావణమాసం సందర్భంగా సామూహిక శ్రీ వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు ఘనంగా నిర్వహించారు. ఇంగిలిపాకలంక గ్రామంలో కోదండ రామాలయం వద్ద ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి శ్రీ వరలక్ష్మి అమ్మవారిని ప్రతిష్టించి శ్రీ వరలక్ష్మి కథ ఆచరించి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి దీప దూప నైవేద్యాలను సమర్పించారు.