పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయం

71చూసినవారు
పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయం
పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయం అని మండవల్లి సర్పంచ్ మెండా ఝాన్సి అన్నారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం మండవల్లి సచివాలయంలో సర్పంచ్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. తొలుత సర్పంచ్ నూతన జెండా దిమ్మను ప్రారంభోత్సవం చేసి అనంతరం జాతీయజెండాను ఆవిష్కరించారు. మహానీయుల త్యాగఫలాల గురించి నాయకులు వివరించారు. కార్య దర్శి కొండలు, పంచాయతీ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్