మీకోసం ద్వారా వచ్చే అర్జీలను అత్యంత బాధ్యతతో పరిశీలించి అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపాలని సంబంధిత శాఖల అధికారులను జిల్లా జాయింట్ కలెక్టరు టి. రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం మీకోసం సమావేశ మందిరంలో వచ్చిన ఫిర్యాదుదారుల నుండి జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ జె. ఉదయ భాస్కరరావు, డ్వామా పిడి కె.సి.హెచ్. అప్పారావు అర్జీలను స్వీకరించారు.