మొగల్తూరు మండలంలో రామన్నపాలెం రైతుసేవాకేంద్రం ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తాహసిల్దార్ కే రాజ్ కిషోర్ అన్నారు. మంగళవారం తన కార్యాలయంలో వ్యవసాయ రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలును సద్వినియోగపరుచుకొనవలసినదిగా ఆయన కోరారు. ఎండియు వాహనదారులు తమ వాహనాలకి రేషన్ సరుకుల ధరల పట్టిక ప్రజలకు కనిపించే విధముగా ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.