రెవెన్యూ డివిజనల్ అధికారి దాసి రాజును నర్సాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఆయన ఛాంబర్లో ఇటీవల డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ జి. శ్రీవేద గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఆర్డీవో మాట్లాడుతూ శాంతిభద్రతల పర్యవేక్షణలో పోలీసుల బాధ్యత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నర్సాపురం డివిజన్ పరిస్థితులను అవగాహన చేసుకుని ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించాలని డిఎస్పీ శ్రీవేదను ఆర్డీవో రాజు సూచించారు.