నూజివీడు మండలం మీర్జాపురం గ్రామంలో మంగళవారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై సామాజిక తనిఖీ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో జరిగిన పలు పనులలో అవకతవకలు జరిగాయని గ్రామస్తులు ఆరోపణలు చేశారు. సామాజిక పెన్షన్ల మంజూరు, ఉపాధి హామీ పనులకు అనుసంధానంగా ఉన్న ఇతర పనులకు సంబంధించి సామాజిక తనిఖీ బృందం రికార్డులు తనిఖీ చేశారు.