విజయవాడ ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా పాలకొల్లు ఎమ్మెల్యే, మంత్రి నిమ్మల రామానాయుడు ఆమె చిత్రపటానికి పూల మాలల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. భారతదేశంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు గాని, బాల్య వివాహాలకు గాని దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి మహనీయురాలు సావిత్రిబాయి పూలే అన్నారు. ఆమె మా తెలుగుదేశం పార్టీకి ఎంతో ఆదర్శమన్నారు.