జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు గ్రామంలో 70 తాటి టెంకలు తిన్న గేదెకు పశువైద్యులు శనివారం చికిత్స చేశారు. గ్రామానికి చెందిన నారం పుష్ప అనే మహిళకు కొన్ని పాడి గేదెలు ఉన్నాయి. శనివారం అందులో ఒక గేదకి దవడలు వాచిపోయి ఊపిరి ఆడని స్థితిలో ఉండడం చూసి స్థానిక పశువైద్యశాలకు తరలించారు. పశు వైద్యాధికారి డా. సాయి బుచ్చిరావు గేదెకి చికిత్స చేసి కడుపులో ఉన్న సుమారు 70 తాటి టెంకలను బయటకు తీశారు.