కొయ్యలగూడెం: తారాజువ్వ పడి ఇల్లు దగ్ధం

50చూసినవారు
కొయ్యలగూడెం 8వ వార్డు రామాలయం వీధిలో ఆదివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. పిండింటి భాను అనే వ్యక్తికి చెందిన ఇల్లు అగ్ని ప్రమాదానికి గురైంది. తారాజువ్వ ఇంటిపై పడడంతో ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న జంగారెడ్డిగూడెం అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్నిప్రమాద సమయంలో ఇంటిలో ఎవరూ లేకపోవడంతో ఆస్తి నష్టం మాత్రమే సంభవించిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్