ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం వేలేరుపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని కూటమి నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాలలో విద్యార్థులకు ఆహారం పంపిణీ చేసి వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో 20 అడుగుల మంత్రి నారా లోకేష్ కట్ అవుట్ కు పాలాభిషేకం చేశారు.