ముంపుకు గురైన 31 పంచాయతీలకు రూ. 31 లక్షలు పంపిణి

73చూసినవారు
పోలవరం నియోజకవర్గంలో వరద ముంపుకు గురైన పంచాయతీలకు నిధుల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం బయ్యనగూడెంలోని స్థానిక కళ్యాణమండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బాలరాజు హాజరయ్యారు. అనంతరం నియోజకవర్గానికి చెందిన 31 పంచాయతీలకు రూ. 31 లక్షలను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆయా గ్రామాల సర్పంచులకు అందజేశారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విరాళంగా అందించిన రూ. 4 కోట్లతో వీటిని అందిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్