ఆటో స్టాండ్ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

82చూసినవారు
పాలకొల్లు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో స్నేహ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం వినాయకచవితి అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇంత గొప్పగా చవితి ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని మంత్రి అన్నారు. తన వంతు సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. అధ్యక్షుడు పసుపులేటి రాజేష్ ఖన్నా, స్నేహ ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్