రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు వైసిపి ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ లేఖ రాశారు. తణుకు సమీపంలో తేతలి వద్ద ఉన్న లెహం ఫుడ్ ప్రోడక్ట్స్‌లో పశువధ జరగడంతో అక్కడి స్థానికులు అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. అది ఆదికవి నన్నయ్య యాగం చేసిన ప్రాంతమని, అనేక మంది కవులు నడయాడిన ప్రాంతంలో పశువధ జరగడం బాధాకరమన్నారు. కావున ఆ ఫ్యాక్టరీని మూసివేయించాలని లేఖలో కోరారు.