తణుకు నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజల నుంచి ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ గురువారం వినతులు స్వీకరించారు. ఆయా గ్రామాల్లో తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే రాధాకృష్ణ దృష్టికి తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో ఫోనులో మాట్లాడిన ఎమ్మెల్యే సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.