కూటమి ప్రభుత్వం ఏ కారణాలు లేకుండా వైసీపీ నాయకులను అరెస్టు చేస్తోందని తణుకు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా సోమవారం తణుకు నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పొట్ల సురేశ్‌ను పోలీసులు అక్రమ అరెస్టు చేశారని ఆయన మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు సరికావన్నారు.