పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామంలో విఆర్వో గా పని చేస్తున్న సంపద స్వామి నాయుడు (48 సం) బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. రెండు రోజుల క్రితం నుండి ఆయనకు మైల్డ్ స్ట్రోక్ రావటంతో భీమవరం ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. బుధవారం నొప్పి ఎక్కువవ్వడంతో ఆయన తుది శ్వాస విడిచారు. దీంతో వీఆర్వో లు సంఘం పాలకోడేరు, భీమవరం ఎమ్మార్వోలు, ఆర్ఐలు సంతాపం వ్యక్తం చేశారు