పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ జుత్తిగ నాగరాజును శుక్రవారం జనసేన పార్టీ పాలకోడేరు గ్రామ ముఖ్య నాయకులు కలిసి కూటమి గెలుపు పై హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు పుష్పగుచ్చం అందించి సాలువాతో సత్కరించారు. శుక్రవారం ఆయన పెళ్లి రోజు కావడంతో మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. రానున్న కాలంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు గ్రామ జనసేన పార్టీ అధ్యక్ష పదవిపై సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.