చేపల చెరువుల్లో మేతకు కోడి మాంసం వ్యర్థాలు రవాణా చేస్తున్న ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు భీమడోలు ఎస్సై సుధాకర్ తెలిపారు. అంబరుపేట వద్ద వినాయక్ అనే వ్యక్తి సాగు చేసే చేపల చెరువులో నాలుగు టన్నుల కోడి మాంసం వ్యర్థాలను సోమవారం తరలిస్తుండగా పోలీసులు అడ్డుకొని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో మొత్తం ఏడుగురిని గుర్తించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు