విజయవాడ: చంద్రబాబు నేతృత్వంలో స్వర్ణాంధ్ర ఆవిష్కృతం
రాజధాని అమరావతి పనులు పున: ప్రారంభంపై మంత్రి సవిత హర్షం వ్యక్తంచేశారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో స్వర్ణాంధ్ర ఆవిష్కృతం కావడం తథ్యమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతూ శనివారం రాజధాని పనులకు శ్రీకారం చేట్టారన్నారు.