AP: అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. చింతూరులో రహదారిపై నుంచి వెళుతున్న కారును ఒక్కసారిగా చుట్టుముట్టారు. అందులోని ప్రయాణికులను కిందకు దింపారు. ఆ తర్వాత కారుకు నిప్పంటించారు. మావోయిస్టుల చర్యలను ప్రత్యక్షంగా చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. మావోయిస్టులు ఈ చర్యకు పాల్పడ్డారో మాత్రం ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.