డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో భారతీయ అమెరికన్‌కు తన పాలకవర్గంలో చోటు కల్పించారు. భారత సంతతికి చెందిన హర్మీత్ కె.ధిల్లాన్‌ను పౌర హక్కుల సహాయ అటార్నీ జనరల్‌గా నియమించారు. ఈమేరకు ఆయన సోషల్‌మీడియా ట్రూత్ వేదికగా వెల్లడించారు. ‘అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్‌లో సివిల్ రైట్స్ కోసం అసిస్టెంట్ అటార్నీ జనరల్‌గా హర్మీత్ కె.ధిల్లాన్‌ను నామినేట్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది’ అని ట్రంప్ అన్నారు.