AP: దర్శకుడు ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరగనుంది. చంద్రబాబు, పవన్, లోకేశ్‌పై అసభ్యకర పోస్టులు పెట్టారనే ఆరోపణలపై ఆర్జీవీపై పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. వీటిపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను శుక్రవారం వరకు పొడిగించింది.