AP: కృష్ణా జిల్లా పెనమలూరులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గంజాయి మత్తులో ఓ యువకుడు గ్రామంలో కొద్ది రోజులుగా హల్ చల్ చేస్తున్నాడు. దాంతో గ్రామస్థులు ఆ యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. యువకుడిని పెనమలూరు పీఎస్‌కు తరలించే క్రమంలో గ్రామస్థులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, గ్రామస్థులకు మధ్య ఘర్షణ జరిగింది.