సినీ నటుడు మోహన్ బాబు తన శేషజీవితం ప్రశాంతంగా గడిపేందుకు శంషాబాద్ సమీపంలోని జల్‌పల్లిలో విశాలమైన ఇల్లు కట్టుకున్నారు. ఇందులో గార్డెన్, స్విమ్మింగ్ పూల్, సిబ్బంది గదులతోపాటు సకల సౌకర్యాలతో విలాసవంతంగా నిర్మించారు. ప్రస్తుతం ఈ ఇంటి విలువ రూ.కోట్లలో ఉంటుంది. కాగా ఫిల్మ్ నగర్‌లో ఉండే ఇల్లు లక్ష్మీ ప్రసన్నకు ఇచ్చేశారు. ఇప్పుడు జల్‌పల్లి నివాసాన్ని స్వాధీనం చేసుకునేందుకు మంచు మనోజ్ ప్రయత్నిస్తున్నారన్నది మంచు ఫ్యామిలీ ఆరోపణ.