అతిగా నిద్రపోయే వ్యక్తుల్లో గుండె సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రోజుకు 9 గంటలు నిద్రపోయేవారిని.. కరోనరీ ఆర్టరీతో పాటు హార్ట్ ఫెయిల్యూర్ వంటి సమస్యలు చుట్టుముడతాయి. అతిగా నిద్రపోయేవారిని తలనొప్పి వేధిస్తుంది. టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువ. నిద్రలేమి, అతినిద్ర రెండూ మనిషిలో బలహీనమైన గ్లూకోజ్ టాలెరెన్స్‌కు దారితీస్తాయని ఒక అధ్యయనం వెల్లడించింది.