AP: సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం చెలరేగగా.. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ క్రమంలో 7 వాహనాలు ధ్వంసమయ్యాయి. కృష్ణాపురం జమీర్ అనే వ్యక్తి వైసీపీ నుంచి బీజేపీలోకి చేరేందుకు సిద్ధమయ్యారు. సోమవారం మంత్రి సత్యకుమార్ సమక్షంలో బీజేపీలోకి జమీర్ చేరుతున్న నేపథ్యంలో పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిని గమనించిన టీడీపీ నేతలు వారిని అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది.