AP: కడప జిల్లా మైదుకూరు మండలం కేశలింగాయపల్లె వద్ద శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పి చలమయ్య, లక్ష్మీదేవి దంపతులు స్పాట్ లోనే మృతి చెందారు. మైదుకూరు పట్టణంలో నివాసం ఉంటున్న దంపతులు పొలం పనులు చూసుకుని మైదుకూరుకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. రెండు లారీల మధ్య ద్విచక్ర వాహనం నలిగి నుజ్జు అయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో మరొకరికి గాయాలు కావడంతో చికిత్స కోసం తరలించారు.