రూపాయి చిహ్నం సమస్య కాదు: పి.చిదంబరం

85చూసినవారు
రూపాయి చిహ్నం సమస్య కాదు: పి.చిదంబరం
రూపాయి చిహ్నం సమస్య కాదని, నచ్చినట్లు ఉపయోగించుకోవచ్చని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం అన్నారు. శివగంగైలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఇకమీదటైనా కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకి ఇవ్వాల్సిన నిధులు కేటాయిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. రూపాయి చిహ్నం ఆయా భాషల ప్రకారం సూచిస్తారని, పత్రాల్లో ఆంగ్ల ఆర్‌ఎస్‌ అక్షరాలే ఉపయోగిస్తున్నామన్నారు. ఏ రూపాయి చిహ్నాన్ని ఉపయోగిస్తున్నామో అనేది సమస్య కాదని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్