AP: పెంగల్ తుఫాను చిత్తూరు జిల్లాలో బీభత్సం సృష్టించింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ క్రమంలో నగరిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన ఓ వ్యక్తి అంతిమయాత్ర నిర్వహించేందుకు బంధువులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఆదివారం అంతిమయాత్ర నిర్వహించగా.. గ్రామం నుంచి ఊరి చివరన ఉన్న శ్మశానం వరకూ అడుగు మేర ఉన్న నీటిలోనే నడిచి ఎట్టకేలకు అంత్యక్రియలు ముగించారు.