ఎండు కొబ్బరి తింటే ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ప్రొటీన్లు, విటమిన్లు, ఐరన్, కాల్షియం, మాంగనీస్, సెలీనియం, కాపర్, ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం మొదలైనవి ఉంటాయి. రోజూ దీన్ని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఉదయం పూట ఎండు కొబ్బరి తింటే రక్తహీనత దరిచేరదు.