రాజకీయాలకు విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పటం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని విజయసాయిరెడ్డి నివాసానికి తిరుపతి ఎంపీ గురుమూర్తి చేరుకున్నారు. విజయసాయి రాజకీయాల నుంచి తప్పుకునే నిర్ణయం ఆశ్చర్యం కలిగించిందని ఎంపీ తెలిపారు. ఎందుకీ నిర్ణయం తీసుకున్నారో తెలుసుకునేందుకు విజయసాయి రెడ్డిని కలవడానికి వచ్చానని గురుమూర్తి పేర్కొన్నారు.