భార్యను చంపిన ఘటన.. వెలుగులోకి మరిన్ని విషయాలు

61చూసినవారు
భార్యను చంపిన ఘటన.. వెలుగులోకి మరిన్ని విషయాలు
TG: హైదరాబాద్ మీర్‌పేటలో భార్యను చంపి ముక్కలుగా చేసి ఉడికించిన ఘటనలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆరోజు ముందు భార్య భర్తలు సినిమాకు వెళ్లొచ్చారు. ఆపై ఊరెళ్లే విషయంలో గొడవపడి భార్యను గురుమూర్తి చంపేశాడు. వారి స్వగ్రామమైన ప్రకాశం జిల్లా JPచెరువులో భర్తకు యువతితో వివాహేతర సంబంధం ఉన్న నేపథ్యంలో గొడవ జరగ్గా, అప్పట్నుంచి ఊరెళ్లడం లేదు. భార్య చనిపోయాక పిల్లలను చూసుకునేందుకు తెలిసిన అమ్మాయైతే మంచిదనే సెంటిమెంట్‌తో ఆమెను పెళ్లి చేసుకోవాలని గురుమూర్తి ప్లాన్ వేశాడు.

సంబంధిత పోస్ట్