అంబులెన్స్‌లో మంటలు.. తప్పిన ప్రమాదం (వీడియో)

68చూసినవారు
AP: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రమేశ్ హాస్పిటల్‌కు చెందిన అంబులెన్స్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన జరిగిన సమయంలో అంబులెన్స్‌లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అంబులెన్స్‌లో చెలరేగిన మంటలు ఆ పక్కనే ఉన్నబస్టాండ్‌కు కూడా వ్యాపించడంతో.. బస్టాండ్ కూడా పాక్షికంగా దెబ్బతింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్